Super star Krishna: తాత ఫొటో చూసి రమేశ్‌ తనయుడి భావోద్వేగం

తన తాతయ్య, సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ. అమెరికా నుంచి వచ్చిన అతడు.. తాతయ్యను చివరిసారి చూసుకోలేకపోయానని వాపోయాడు. 

Updated : 17 Nov 2022 18:48 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ (Super star Krishna) కన్నుమూతతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఉదయం కృష్ణ తుది శ్వాస విడిచిన అనంతరం కుటుంబసభ్యులు, అభిమానుల సందర్శన తర్వాత బుధవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అయితే, తన తాతయ్యను కడసారి చూసుకోలేకపోయినందుకు కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌ బాబు తనయుడు జయకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అమెరికాలో ఉంటోన్న జయకృష్ణ నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే కార్యక్రమాలన్నీ పూర్తి కావడంతో అతడు కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాడు. ఘట్టమనేని కుటుంబం గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కేవలం కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కృష్ణ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని