God Father: చిరు- సల్మాన్‌ వస్తే భూమి దద్దరిల్లాలంతే.. ‘తార్‌మార్‌’ ఫుల్‌ వీడియో వచ్చేసింది

చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలోని ‘తార్‌మార్‌ తక్కర్‌మార్‌’ పాట ఫుల్‌ వీడియో విడుదలైంది. చిరు, సల్మాన్‌ఖాన్‌ల డ్యాన్స్‌ అదిరింది.

Published : 12 Oct 2022 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల విడుదలై, శ్రోతలను ఉర్రూతలూగించిన పాటల్లో ‘తార్‌మార్‌ తక్కర్‌మార్‌’ (Thaar Maar Thakkar Maar) ఒకటి. ప్రముఖ నటులు చిరంజీవి (Chiranjeevi), సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)లు కలిసి నర్తించిన పాటకావటంతో లిరికల్‌ వీడియోకే విశేష ఆదరణ దక్కింది. ఈ ఇద్దరి అగ్ర తారల డ్యాన్స్‌ను పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురుచూసిన వారికి ‘గాడ్‌ ఫాదర్’ (God Father) చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో ‘తార్‌మార్‌’ ఫుల్‌ వీడియో విడుదల చేసింది. చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా తెరకెక్కించిన చిత్రమే ‘గాడ్‌ ఫాదర్‌’. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం చిరు- సల్మాన్‌ల స్టెప్పులు చూసేయండి..


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు