God Father: ‘గాడ్‌ ఫాదర్‌’ అంటే ఇదీ.. టైటిల్‌ సాంగ్‌ విన్నారా!

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా రూపొందించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 03 Oct 2022 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 5న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా టైటిల్‌ గీతాన్ని అభిమానులతో పంచుకుంది. కథానాయకుడి పాత్రకు అద్దం పట్టే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు. తమన్‌ పవర్‌ఫుల్‌ సంగీతం అందించారు. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ ‘గాడ్‌ ఫాదర్‌’ మలయాళ సినిమా ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని