దేవుడికీ జోక్స్‌ అంటే ఇష్టమే: ట్వింకిల్‌ఖన్నా

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ట్వింకిల్‌ఖన్నా మరోసారి వార్తల్లోకి వచ్చారు. సోషల్‌ మీడియాలో వైరల్ అయిన తన మార్ఫింగ్‌ ఫొటోపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘నేను నా ఫొటోల కోసం వెతికినప్పుడు ట్రోల్స్‌ కూడా కొన్నిసార్లు నాకు ఉపయోగపడతాయి.

Published : 09 Nov 2020 23:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ట్వింకిల్‌ఖన్నా మరోసారి వార్తల్లోకి వచ్చారు. సోషల్‌ మీడియాలో వైరల్ అయిన తన మార్ఫింగ్‌ ఫొటోపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘నేను నా ఫొటోల కోసం వెతికినప్పుడు ట్రోల్స్‌ కూడా కొన్నిసార్లు నాకు ఉపయోగపడతాయి. అందులో ఇదీ ఒకటి. దీన్ని రీపోస్ట్‌ చేయడం కంటే క్రాప్‌ చేయదలచుకున్నాను. మీరు చేసేది మంచి జోక్‌ అయితే దేవుడు కూడా కచ్చితంగా ఇష్టపడతాడు. కానీ, మీరు దేవుడిపైనే జోకులు వేస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి’ అని ఆమె తనదైన శైలిలో అసహనం వ్యక్తం చేశారు. ఆ ఫొటోను తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పోస్టు చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ట్వింకిల్‌ ఖన్నా భర్త, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ నటించిన చిత్రం ‘లక్ష్మీబాంబ్‌’. ఆ సినిమాకు సంబంధించిన ప్రచారపోస్టర్‌ను ఒక వ్యక్తి ఎడిట్‌ చేశాడు. అక్షయ్‌కుమార్‌ ఫొటో స్థానంలో ట్వింకిల్‌ ఖన్నా ఫొటోపెట్టాడు. ఆ ఫొటోలో ఆమె శరీరాన్ని నీలిరంగుతో మార్పింగ్‌ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎరుపురంగు వేసి ఆ పోస్టర్‌పై ‘ట్వింకిల్‌ బాంబ్‌’ అని రాసుకొచ్చాడు. దాన్ని ట్విటర్‌లో పోస్టు చేశాడు. అది కాస్తా ట్వింకిల్‌ఖన్నా వరకూ చేరింది. దీంతో ఆ మార్ఫింగ్‌ ఫొటోపై ఆమె స్పందించారు. ఆ పోస్టు చేసిన వ్యక్తిని మూడో తరగతి వ్యక్తి అంటూ ట్వింకిల్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్రోలింగ్‌ ఎందుకు చేస్తున్నారో కారణాలు కూడా తనకు తెలుసని ఆమె పేర్కొన్నారు. 

లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ ప్రధానపాత్రలో కనిపించనున్నాడు. కియారా హీరోయిన్‌. తెలుగు, తమిళ భాషల్లో మంచి హిట్ అందుకున్న ‘కాంచన’ చిత్రానికి ఇది రీమేక్‌.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని