
God Se: సత్యదేవ్ ‘గాడ్సే’, కార్తి ‘విరుమన్’.. విడుదల ఎప్పుడంటే?
ఇంటర్నెట్ డెస్క్: సత్యదేవ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్సే’ విడుదల వాయిదా పడింది. మే 20న ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం వెల్లడించింది. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత సత్యదేవ్- దర్శకుడు గోపీ గణేష్ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రమిది. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమాకి సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం: ఎస్.సురేశ్.
విరుమన్ ఆగమనం ఆ రోజే
ముత్తయ్య దర్శకత్వంలో కార్తి నటిస్తున్న చిత్రం ‘విరుమన్’. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 31న విడుదలకానుంది. సామాజిక మాధ్యమం ద్వారా ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ను పంచుకుంది. ఇందులో కార్తి కళ్లద్దాలు పెట్టుకుని, నవ్వుతూ కనిపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Komatireddy: భూములిచ్చిన రైతులకు బేడీలా? కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
-
Sports News
T20 World Cup: టీమ్ఇండియాకు షాకేనా..? టీ20 ప్రపంచకప్ జట్టులో షమి లేనట్టేనా..?
-
India News
Nirmala Sitharaman: ‘హార్స్ ట్రేడింగ్’పై జీఎస్టీ.. నిర్మలమ్మ పొరబాటు..
-
Movies News
Social Look: రెజీనా ‘లైఫ్’ క్యాప్షన్.. కట్టిపడేసేలా జాక్వెలిన్ ‘రెడ్’లుక్!
-
General News
Cesarean Care: శస్త్రచికిత్స తర్వాత ఏం జరుగుతుందంటే...!
-
World News
Putin: ‘నాటోలో ఆ రెండు దేశాల చేరికపై మాకేం సమస్య లేదు. కానీ..’ పుతిన్ కీలక వ్యాఖ్యలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- BJP: అంబర్పేట్లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్