Updated : 19 May 2022 06:52 IST

Satyadev: ప్రశ్నించే యువకుడి కథ

వినీతి రాజకీయానికి కేరాఫ్‌ అయిన కొంతమంది నాయకుల్ని ప్రశ్నించిన ఓ యువకుడి కథే మా చిత్రం అంటున్నారు సి.కల్యాణ్‌. ఆయన నిర్మాణంలో సత్యదేవ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్‌ పట్టాభి     దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌ 17న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ‘‘సత్యదేవ్‌ - గోపి గణేష్‌ కలయికలో వచ్చిన ‘బ్లఫ్‌మాస్టర్‌’ ప్రేక్షకుల మెప్పు పొందింది. అదే కలయికలో, మరో బలమైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అవినీతితో నిండిపోయిన రాజకీయ వ్యవస్థని ఒంటి చేత్తో ఎదుర్కొనే యువకుడిగా శక్తివంతమైన పాత్రని పోషించారు సత్యదేవ్‌. ఐశ్వర్యలక్ష్మి ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ‘గాడ్సే’ తప్పకుండా ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తుంద’’న్నారు. బ్రహ్మాజీ, సిజ్జు మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని