క్లైమాక్స్‌లో అల్లు అర్జున్‌ని బట్టల్లేకుండా చూపిద్దామనుకున్నా!: సుకుమార్‌

 ‘ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాల్లో ప్రేమికుడిగా..  ‘పుష్ప- ది రైజ్‌’లో ఊరమాస్‌ గెటప్‌లో అల్లు అర్జున్‌ని ప్రేక్షకులకు దగ్గరచేశాడు దర్శకుడు సుకుమార్‌. వైవిధ్యానికి కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచే సుకుమార్‌.. పుష్ప క్లైమాక్స్‌ సీన్‌ గురించి ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు.

Published : 26 Dec 2021 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాల్లో ప్రేమికుడిగా.. ‘పుష్ప- ది రైజ్‌’లో ఊరమాస్‌ గెటప్‌లో అల్లు అర్జున్‌ని ప్రేక్షకులకు దగ్గరచేశాడు దర్శకుడు సుకుమార్‌. వైవిధ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఆయన.. ‘పుష్ప’ క్లైమాక్స్‌ సీన్‌ గురించి ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు. ‘‘సినిమా క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్‌ ఇద్దరూ ప్యాంట్‌ షర్ట్‌ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ న్యూడ్‌గా చూపించాలనుకున్నా. కానీ, తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి మార్పులు చేశాం’’ అన్నారు.

గతంలో అల్లు అర్జున్‌ని ఎప్పుడూ చూపించని విధంగా.. ‘పుష్పరాజ్‌’గా అల్లు అర్జున్‌ రఫ్‌ లుక్‌లో చూపించేందుకు సుకుమార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మేకప్‌ వేసుకునేందుకు బన్నీ సుమారు రెండు గంటల సమయం పట్టేదట. షూట్‌ అవ్వగానే అల్లు అర్జున్‌ సైతం వర్కౌట్స్‌ చేసేవారు. ఇక పుష్ప సెకెండ్‌ పార్ట్‌ ‘పుష్ప- ది రూల్‌’ను మరింత మాస్‌ అంశాలతో తీసుకురానున్నారు మన లెక్కల మాస్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని