ఆకట్టుకునేలా ‘గోల్డ్‌ మెడల్‌’ టీజర్‌

ఉదయ్‌ కుమార్‌, దివ్య శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గోల్డ్‌ మెడల్‌’. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. గోల్డ్‌ కోటింగ్‌ పేరుతో కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి...

Published : 27 May 2021 15:08 IST

హైదరాబాద్‌: ఉదయ్‌ కుమార్‌, దివ్య శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గోల్డ్‌ మెడల్‌’. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. గోల్డ్‌ కోటింగ్‌ పేరుతో కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారాన్ని ఎత్తుకుపోయారని మనం ఎన్నో సార్లు విన్నాం. ఇప్పుడు అదే తరహా కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఉదయ్‌ కుమార్‌ నటన ఆసక్తిని రేకేత్తించేలా ఉంది. అలాగే ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. యూకే క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని