వైవిధ్యంగా ‘గోల్డ్‌ మెడల్‌’ ట్రైల‌ర్‌

న‌టీన‌టులెవ‌రైనా క‌థ బాగుంటే చాలని చిన్న సినిమాల‌కు విజ‌యాల్ని అందిస్తున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. ఈ నేప‌థ్యంలోనే వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా నిలిచే క‌థ‌లు విరివిగా వ‌స్తున్నాయి. అలా తెర‌కెక్కుతోన్న ఓ చిత్ర‌మే ‘గోల్డ్‌ మెడల్‌’.

Updated : 03 Jun 2021 23:35 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  న‌టీన‌టులెవ‌రైనా క‌థ బాగుంటే చాలని చిన్న సినిమాల‌కు విజ‌యాల్ని అందిస్తున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. ఈ నేప‌థ్యంలోనే వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా నిలిచే క‌థ‌లు విరివిగా వ‌స్తున్నాయి. అలా తెర‌కెక్కుతోన్న ఓ చిత్ర‌మే ‘గోల్డ్‌ మెడల్‌’. ఉదయ్‌ కుమార్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు ఆయ‌నే అందిస్తున్నారు. దివ్య శ్రీ నాయిక‌. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. గోల్డ్ కోటింగ్ వేసే వ్య‌క్తిగా క‌నిపించారు ఉద‌య్‌. ‘బంగారం అక్ష‌య తృతీయ నాడు కొనాలి’, ‘ఈ అక్ష‌య తృతీయ‌కి బంగారం కొందాం’, ‘నీ నుంచి గోల్డ్ మెడ‌ల్ ఆశిస్తున్నా’.. ఇలా బంగారంతో ముడిప‌డిన డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రోవైపు ఆసుప‌త్రిలో ఎవ‌రికో సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు చూపించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. మ‌రి గోల్డ్ కోటింగ్ వేసే కథానాయకుడు ఏమేం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. యూకే క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎం.న‌వీన్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజా సంగీతం అందిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని