Good Luck Sakhi: సఖి.. మళ్లీ వెనక్కి

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాని ఈనెల 26న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

Updated : 21 Jan 2023 16:46 IST

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాని ఈనెల 26న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడీ చిత్రాన్ని డిసెంబర్‌ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేసేందుకు.. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. డిసెంబర్‌ 10 సరైన తేదీ అనుకున్నాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నగేష్‌ కుకునూర్‌ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రాన్ని సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు