Updated : 25 Jan 2022 12:16 IST

Good Luck Sakhi: గెలుపే అలవాటు

న రాత మనమే రాసుకోవాలా అంటున్న అమ్మాయి కథేమిటో తెలియాలంటే ‘గుడ్‌లక్‌ సఖి’ చూడాల్సిందే. కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలకపాత్రలు పోషించారు. నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్‌చంద్ర పదిరి నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘మన దేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నా...’ అంటూ జగపతిబాబు చెప్పే సంభాషణతో ట్రైలర్‌ మొదలవుతుంది. బ్యాడ్‌లక్‌ సఖి అని పిలిపించుకునే ఓ అమ్మాయి గెలుపునే అలవాటు చేసుకుని దూసుకెళ్లే క్రమమే ఈ చిత్రమని ట్రైలర్‌నిబట్టి స్పష్టమవుతోంది. షూటింగ్‌ క్రీడ నేపథ్యంలో సాగే కథతో చిత్రం రూపొందింది. కీర్తిసురేష్‌ ప్రతిభావంతురాలైన ఓ పల్లెటూరి యువతిగా నటిస్తుంది. కోచ్‌గా జగపతిబాబు కనిపిస్తారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రావ్యవర్మ, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని