
Chiranjeevi: మరి కొన్నిగంటల్లో ఫంక్షన్.. మారిన చీఫ్‌గెస్ట్ పేరు
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు చిరంజీవి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన ప్రకటించారు. దీంతో ఆయన పాల్గొనాల్సిన ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మరో నటుడు హాజరు కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇంతకీ ఆ కార్యక్రమం ఏమిటంటే ‘గుడ్‌లక్ సఖి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.
కీర్తి సురేశ్, జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్‌లక్ సఖి’. నాగేశ్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో ‘గుడ్ లక్ సఖి’ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని చిత్రబృందం భావించింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా అతి తక్కువ మంది అభిమానుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని చిత్రబృందం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. అయితే, తాజాగా ఆయన కరోనా బారిన పడినట్లు వెల్లడించడంతో ‘గుడ్‌లక్ సఖి’ టీమ్ కాస్త ఆందోళనకు గురైంది. ఈ క్రమంలోనే చిరంజీవితోపాటు సదరు చిత్రబృందం రామ్‌చరణ్‌తో మాట్లాడింది. దీంతో చిరంజీవి స్థానంలో రామ్‌చరణ్ వచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఈరోజు సాయంత్రం జరగబోయే కార్యక్రమంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా సందడి చేయనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.