Goodachari 2: ప్రపంచ స్థాయి ఫ్రాంచైజీగా... ‘జి2’

‘‘దక్షిణాదిలో మళ్లీ స్పై సినిమాల ట్రెండ్‌ని తీసుకొచ్చింది ‘గూఢచారి’. ఇది  ‘జి2’తో ఫ్రాంచైజీగా మారుతుంది. సిక్స్‌ప్యాక్‌ దేహం సిద్ధం చేశాక చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు అడవి శేష్‌.

Updated : 11 Jan 2023 07:01 IST

‘‘దక్షిణాదిలో మళ్లీ స్పై సినిమాల ట్రెండ్‌ని తీసుకొచ్చింది ‘గూఢచారి’. ఇది  ‘జి2’తో ఫ్రాంచైజీగా మారుతుంది. సిక్స్‌ప్యాక్‌ దేహం సిద్ధం చేశాక చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు అడవి శేష్‌ (Adivi Sesh). ఆయన కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రం ‘జి 2’ (Goodachari 2). ఆయనే కథని సమకూర్చారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో ప్రి విజన్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడవి శేష్‌ మాట్లాడుతూ ‘‘ఈ కథల్ని ఓ ఫ్రాంచైజీగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే తపన ఉంది. గూఢచారి ప్రపంచంపై వినయ్‌కి గొప్ప విజన్‌ ఉంది. ఐదు దేశాల్లో చిత్రీకరణ చేస్తాం. ‘జి2’ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికే ఈ వేడుక. 2024లో ప్రేక్షకుల ముందుకొస్తుంద’’న్నారు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పుడు మా నిర్మాణంలో 20 చిత్రాలు రూపొందుతున్నాయి. అందులో ‘జి2’ ఎంతో ప్రత్యేకమైనది. పాన్‌ వరల్డ్‌ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని