Goodachari 2: మళ్లీ వస్తున్నాడు.. గూఢచారి
‘మేజర్’, ‘హిట్2’ విజయాలతో జోరు మీదున్నారు కథానాయకుడు అడివి శేష్. ఇప్పుడీ జోష్‌లోనే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. శేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమా ‘గూఢచారి’.
‘మేజర్’ (Major), ‘హిట్2’ (HIT 2) విజయాలతో జోరు మీదున్నారు కథానాయకుడు అడివి శేష్ (Adivi Sesh). ఇప్పుడీ జోష్‌లోనే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. శేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమా ‘గూఢచారి’ (Goodachari). ఆయన ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘జి2’ పేరుతో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. దీన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాతో ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘గూఢచారి’ కథ మొత్తం భారతదేశంలోనే జరగ్గా.. ఈ రెండో భాగం అంతర్జాతీయంగా ఉండనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ రెండో భాగంలో పరిచయం కానున్నాయి. ఈ చిత్ర ప్రీవిజన్ వీడియోను జనవరి 9న దిల్లీ, ముంబయిలలో విడుదల చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Balapur Laddu Auction: అత్యధిక ధరకు బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఎంత పలికిందంటే?
-
Nitish kumar: మనం బ్రిటీష్ కాలంలో జీవించట్లేదు కదా.. ఆంగ్లంలో డిజిటల్ సైన్బోర్డ్ ఏర్పాటుపై మండిపడ్డ నీతీశ్
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ జాగీర్ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు