RRR: ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన గూగుల్‌.. ఏం చేసిందంటే?

ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్ర బృందానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. గూగుల్‌ సెర్చ్‌లో ‘RRR’లో అని టైప్‌ చేస్తే, గుర్రం, బైక్‌ ఒకదాని వెనుక ఒకటి వెళ్లేలా యానిమేషన్‌ చేసింది.

Published : 14 Aug 2022 02:14 IST

హైదరాబాద్‌: ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్ర బృందానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. గూగుల్‌ సెర్చ్‌లో ‘RRR’లో అని టైప్‌ చేస్తే, గుర్రం, బైక్‌ ఒకదాని వెనుక ఒకటి వెళ్లేలా యానిమేషన్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్స్‌ ‘గూగుల్‌ భలే సర్‌ప్రైజ్‌’ అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇది కాస్తా వైరల్‌ కావడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హ్యాష్‌టాగ్‌ ట్విటర్‌లో మరోసారి ట్రెండ్‌ అవుతోంది. అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాక్సాఫీస్‌ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ఈ సినిమా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్పందన వచ్చింది. ముఖ్యంగా హాలీవుడ్‌ ప్రముఖులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. బ్రిటిష్‌ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రామ్‌చరణ్‌ గుర్రపు స్వారీ చేయగా, ఎన్టీఆర్‌ బైక్‌పై సందడి చేశారు. గూగుల్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటన్‌టైన్‌మెంట్స్‌ కృతజ్ఞతలు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని