
Balakrishna: హైదరాబాద్‌లో బాలయ్య చిత్రం
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపు కొంటోంది. ఇందులో భాగంగా ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ ఆధ్వర్యంలో బాలకృష్ణపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పోరాట ఘట్టమని, బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రామ్ - లక్ష్మణ్ దీన్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. యథార్థ సంఘటనల ఆధారంగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 40రోజుల చిత్రీకరణ పూర్తయింది. ఇందులో భాగంగా రెండు పోరాట ఘట్టాలు తెరకెక్కించారు. ప్రస్తుతం మూడో ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఓ కీలక షెడ్యూల్ కోసం త్వరలో విదేశాలకు పయనమవనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: టీమ్‌ఇండియాతోనూ ఇదే దూకుడుతో ఆడతాం: బెన్ స్టోక్స్
-
Politics News
ధర్మవరంలో ఉద్రిక్తత.. భాజపా నేతలపై కర్రలతో వైకాపా వర్గీయుల దాడి
-
World News
china: బీజింగ్, షాంఘైల్లో జీరో కొవిడ్ లక్ష్యం సాధించిన చైనా
-
General News
Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
-
General News
Ts Inter results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!
-
Sports News
IND vs ENG: కెప్టెన్సీకి పంత్ ఇంకా పరిపక్వత సాధించలేదు: పాక్ మాజీ క్రికెటర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
- TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఈనాడు.నెట్‌లో చూడొచ్చు
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!