Gopichand Malineni: ఆ బాలీవుడ్‌ హీరోతో గోపిచంద్‌ మలినేని సినిమా.. హీరోయిన్‌ ఎవరంటే!

బాలీవుడ్ హీరో సన్నీ దేవోల్‌తో సినిమాను ప్రకటించారు గోపిచంద్ మలినేని. త్వరలోనే దీని రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. 

Published : 20 Jun 2024 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni)కొత్త సినిమా ప్రకటించారు. బాలీవుడ్‌ హీరో సన్నీ దేవోల్‌తో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను (SDGM) రూపొందించనున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో రెజీనాతో పాటు సయామీ ఖేర్ హీరోయిన్‌లుగా నటించనున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది.

సుదీర్ఘంగా మాట్లాడిన ప్రభాస్‌.. ఆటపట్టించిన దీపికా పదుకొణె

ప్రస్తుతం రవితేజ సినిమాతో (RT4GM) గోపిచంద్ మలినేని బిజీగా ఉన్నారు. వీళ్లిద్దరి కాంబినేషనల్‌లో రానున్న నాలుగో చిత్రమిది. దీనితో పాటే బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు. సన్నీ దేవోల్‌ (Sunny Deol) చివరిగా ‘గదర్‌2’లో నటించారు. అనిల్‌శర్మ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.60 కోట్లతో నిర్మించగా సుమారు రూ.450 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ భారీ హిట్‌ తర్వాత రానున్న సినిమా కావడంతో దీనిపై (SDGM) అంచనాలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని