pawan kalyan: పవన్‌కల్యాణ్‌తో మూవీ మిస్సయిన గోపిచంద్ మలినేని
Pawan kalyan: అనుకోని కారణాల వల్ల పవన్‌కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని దర్శకుడు గోపిచంద్ మిస్సయ్యారట.
హైదరాబాద్: యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు పవన్‌కల్యాణ్ (Pawan kalyan). ఆయనతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు ఆశపడుతుంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని అనుకోని కారణాల వల్ల దర్శకుడు గోపిచంద్ మలినేని (gopichand malineni) వదులుకోవాల్సి వచ్చిందట. ఇంతకీ సినిమా ఏంటో తెలుసా? ‘భీమ్లానాయక్’. మలయాళంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియుం’కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తొలుత గోపిచంద్‌కు వచ్చిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గోపిచంద్ స్వయంగా వెల్లడించారు.
‘పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా. ‘భీమ్లానాయక్’ నేను చేయాలి. కొన్ని చర్చలు కూడా జరిగాయి. అనుకోని కారణాల వల్ల అది మిస్సయింది. ఆ రోజు ఆ సినిమా మిస్సయిందంటే ఇంకేదో ఉందని దాని అర్థం’ అని గోపిచంద్ చెప్పుకొచ్చారు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘భీమ్లానాయక్’ను యువ దర్శకుడు సాగర్ కె.చంద్ర తెరకెక్కించారు. మరోవైపు బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ తీసి, బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు గోపిచంద్ మలినేని. శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!