గోపీ చంద్‌ ‘సీటీమార్‌’ టీజర్‌ అదుర్స్‌

 గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘సీటీమార్‌’. తమన్నా కథానాయిక. కబడ్డీ

Updated : 07 Dec 2022 20:21 IST

హైదరాబాద్‌:  గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘సీటీమార్‌’. తమన్నా కథానాయిక. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న  ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. గోపీచంద్‌-తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. క్రీడా నేపథ్యంతో పాటు, గుండెలను పిండేసే భావోద్వేగాలను సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని