Ananya Pandey: భారీ కుంభకోణంలో శ్రీమంతుల అమ్మాయి!

‘లైగర్‌’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్‌ నాయిక అనన్యా పాండే డిజిటల్‌ బాటలో వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఆమె ఓ సిరీస్‌లో నటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Updated : 26 Sep 2022 11:54 IST

‘లైగర్‌’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్‌ నాయిక అనన్యా పాండే (Ananya Pandey) డిజిటల్‌ బాటలో వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఆమె ఓ సిరీస్‌లో నటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనన్యాను వెండితెరకు పరిచయం చేసిన ధర్మ ప్రొడక్షన్స్‌లోనే ఈ సిరీస్‌ తెరకెక్కనుంది. దీనికి ‘కాల్‌ మీ బీ’ (Call Me B) అనే పేరుని అనుకుంటున్నారట. ఓ పెద్ద కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయిన శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి నేపథ్యంగా ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సిరీస్‌ ప్రసారం కానుంది. అనన్య ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానాతో ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ చిత్రీకరణలో బిజీగా ఉంది.


అలియా.. సాహసాల కేయ

‘రాజీ’, గంగూభాయ్‌ కాఠియావాడీ’లాంటి చిత్రాలతో మెప్పించిన భామ అలియా భట్‌ (Alia Bhatt). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగువారికీ దగ్గరైంది. ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో తను హాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తోంది. అందులో కేయ అనే పాత్ర పోషిస్తోంది. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని నిర్మాణ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఆదివారం విడుదల చేసింది. ‘ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చరిత్ర సృష్టించనుంది. అలియా కేయ ధావన్‌గా కనిపిస్తుండగా, గాల్‌ గ్యాడోట్‌ రాచెల్‌ స్టోన్‌గా అలరించనుంది. వాస్తవిక కథాంశాలకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులు సొంత కథగా భావిస్తారు. తప్పకుండా భావోద్వేగానికి గురవుతారు’ అని ఈ సందర్భంగా పేర్కొన్నాయి సినీవర్గాలు. అలియా ఈ ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ని తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంటూ 2023లో మీ ముందుకొస్తున్నా అని ట్వీట్‌ చేసింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని