#KGF2: రెండోది కూడా క్రిస్మస్కేనా?
కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్నీల్ని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు చేరువ చేసిన చిత్రం ‘కేజీఎఫ్’. ఒక రీజనల్ మూవీగా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది....
బెంగళూరు: కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్నీల్ని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు చేరువ చేసిన చిత్రం ‘కేజీఎఫ్’. ఒక రీజనల్ మూవీగా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ -2’ రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసమే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్-2’ విడుదల గురించి సోషల్మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. సెప్టెంబర్ 9న ‘కేజీఎఫ్-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఈ మేరకు చిత్రనిర్మాతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారని సినీవర్గాల సమాచారం.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా, అన్ని సక్రమంగా ఉంటే అక్టోబర్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని.. అలా కాని పక్షంలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలున్నట్టు సినీవర్గాల భోగట్టా. ఒకవేళ అదే కనుక నిజమైతే అభిమానులు మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. ‘కేజీఎఫ్-1’ సైతం 2018లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ