#NBK108: అనిల్‌తో కలసి బాలకృష్ణ ‘ఐ డోంట్ కేర్’ అంటారా?
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. బాలయ్య 108 చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది....
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. బాలయ్య 108 చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండనుంది. అయితే, ఈ చిత్రానికి ఏం టైటిల్ పెట్టనున్నారనే విషయంలో గత కొంతకాలంగా అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. దీంతో పలు ఆసక్తికరమైన పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా పేరు ఇదే అంటూ గతంలో చాలా పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మరో టైటిల్ తెరపైకి వచ్చింది.
సినిమాలో బాలయ్య వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ‘బ్రో.. ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ పెడితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ సినిమాలో బాలయ్యకు కుమార్తెగా శ్రీలీల నటించనుంది. ప్రియమణి, అంజలి కీలకపాత్రలు పోషిస్తారని సమాచారం. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మధ్య వయస్కుడైన తండ్రీ -కూతుళ్ల మధ్య అనుబంధాలను ఈ సినిమాలో చూపిస్తామని దర్శకుడు ఇప్పటికే చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం