NTR 30: ‘ఎన్టీఆర్ 30’.. సెట్స్‌పైకి ఆరోజే?
‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తి చేసి కాస్త విరామం తీసుకున్నారు కథానాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడాయన కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇది తారక్ నటించనున్న 30వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో
‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తి చేసి కాస్త విరామం తీసుకున్నారు కథానాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడాయన కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇది తారక్ నటించనున్న 30వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రాన్ని.. ఫిబ్రవరి తొలి వారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఫిబ్రవరి 7న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. కొరటాల శైలి సామాజిక అంశాలతో.. చక్కటి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తన శరీరాకృతిని మార్చుకుంటున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఆయన బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో తారక్‌కు జోడీగా అలియా భట్ కనిపించనుందట. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేసినట్లు తెలిసింది. ‘జనతా గ్యారేజ్’ లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కలయిక నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్‌చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్‌తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్‌ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు