Prabhas: రెండు భాగాలుగా ప్రభాస్ చిత్రం!
ప్రభాస్ సినిమా రెండు భాగాలుగా రూపొందడం కొత్తేమీ కాదు. ‘బాహుబలి’ సినిమాలు అలానే వచ్చి ప్రేక్షకుల్ని మెప్పించాయి.
ప్రభాస్ సినిమా రెండు భాగాలుగా రూపొందడం కొత్తేమీ కాదు. ‘బాహుబలి’ సినిమాలు అలానే వచ్చి ప్రేక్షకుల్ని మెప్పించాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు కూడా ఒకొక్కటి రెండు భాగాలుగా రూపొందుతాయనే సంకేతాలొస్తున్నాయి. ఇవే కాదు... మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా కూడా రెండు భాగాలుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. హారర్ అంశాలతో కూడిన ఆ సినిమా తాత మనవళ్ల కథతో తెరకెక్కుతున్నట్టు సమాచారం. కథ రీత్యా... దీన్ని రెండు భాగాలుగా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది చిత్రబృందం. ప్రభాస్ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన సరసన మాళవిక మోహనన్‌తోపాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు. ‘రాజా డీలక్స్’ అనే పేరు ప్రచారంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Street Child World Cup 2023: ఆ బాలలకు ప్రపంచకప్ ఆనందం
-
Chandrababu: కోర్టుకు సీల్డ్ కవర్లో చంద్రబాబు కస్టడీ విచారణ నివేదిక
-
India-China: భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం: చైనా రాయబారి
-
దారుణం: అదనపు వడ్డీ కోసం.. మహిళను వివస్త్రను చేసి.. నోట్లో మూత్రం పోయించి..!
-
Tesla Bot: యోగా చేస్తోన్న టెస్లా రోబో.. ఇంకా ఏమేం చేస్తోందంటే..?
-
Bandi Sanjay: గ్రూప్ -1 పరీక్ష నిర్వహించే సత్తాలేని సర్కారు ఇది: బండి సంజయ్