Updated : 07 Jul 2022 11:48 IST

Samantha: త్వరలోనే బాలీవుడ్‌ చిత్రం!

సమంత (Samantha)... హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌.. ఇలా అన్ని పరిశ్రమల్లో అవకాశాలు అందిపుచ్చుకొంటోంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మెన్‌ 2’తో(The Family Man2) హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సామ్‌.. ఓ హాలీవుడ్‌ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. తొలిసారి ఆమె ఏ బాలీవుడ్‌ చిత్రంలో మెరవనుంది? అని ఆమె అభిమానుల్లో ఆసక్తి ఉంది. త్వరలోనే దానికి సమాధానం రానుంది. వరుస హిట్లతో బాలీవుడ్‌లో తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయుష్మాన్‌ ఖురానాతో(Ayushmann Khurrana) కలసి ఆమె తెర పంచుకోనుందని తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ (Bollywood) ఎంట్రీ కోసం ఆమె అనేక కథలు విన్నారు. వాటిల్లో ఇంకా దేన్ని ఓకే చేయలేదు. ప్రస్తుతం ఓ స్క్రిప్ట్‌ ఆమెకు నచ్చిందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అందులోని హ్యూమర్‌, కామెడీ, సస్పెన్స్‌ అంశాలు సామ్‌ను మెప్పించాయట. అందుకే ఈ ప్రాజెక్టు ఓకే చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడని తెలుస్తోంది. దినేష్‌ విజన్‌ అనే నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. దీనికి సంబంధించి మరిన్ని   వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. సమంత వరుణ్‌ ధావన్‌తో కలసి చేస్తున్న హిందీ వెబ్‌సిరీస్‌ త్వరలోనే   ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో ఆమె ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాల్లో నటిస్తోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని