UV creations: యూవీ క్రియేషన్స్‌ ఆఫీస్‌లో జీఎస్టీ నిఘా విభాగం సోదాలు

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ కార్యాలయంలో జీఎస్టీ నిఘా విభాగం సోదాలు నిర్వహించింది.

Published : 02 Nov 2022 11:11 IST

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ కార్యాలయంలో జీఎస్టీ నిఘా విభాగం సోదాలు నిర్వహించింది. ఆ సంస్థకు వస్తున్న ఆదాయం, చెల్లిస్తున్న జీఎస్టీకి వ్యత్యాసం ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కావూరి హిల్స్‌లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 

మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన సోదాల్లో రూ.6కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. లోతైన పరిశీలనకు సంస్థ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాకే యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఇంకా ఎంత జీఎస్టీ చెల్లించాల్సి ఉందో తెలుస్తుందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని