Gultoo: ఉత్కంఠగా ‘గుళ్టు’ ట్రైలర్‌.. ఆహాలో కొత్త సినిమా

‘‘నేను వేరే ఎవ్వరికీ హీరోని కాను. నాకు మాత్రమే హీరోని’’ అని అంటున్నారు కన్నడ యువ నటుడు జనార్దన్‌ చిక్కన్న. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సైబర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘గుళ్టు(Gultoo). కన్నడలో సూపర్‌హిట్‌ అందుకున్న ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు....

Published : 06 Jul 2022 14:16 IST

హైదరాబాద్‌: ‘‘నేను వేరే ఎవ్వరికీ హీరోని కాను. నాకు మాత్రమే హీరోని’’ అని అంటున్నారు కన్నడ యువ నటుడు జనార్దన్‌ చిక్కన్న. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సైబర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘గుళ్టు(Gultoo). కన్నడలో సూపర్‌హిట్‌ అందుకున్న ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ఈ సినిమా జులై 8 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఆహా’ టీమ్‌ గుళ్టు ట్రైలర్‌ని (Gultoo Trailer) బుధవారం విడుదల చేసింది. ‘‘ఆకలి కడుపులకు ఆశలెక్కువ. విశాలంగా పెరిగే మనసు, రోజు రోజుకీ పరిస్థితులకు లొంగిపోయి, కనీసం చిన్న చిన్న ఆశలకు కూడా చోటు లేనంతగా ముడుచుకుపోతుంది’’ అంటూ మొదలైన ఈ ట్రైలర్‌ సైబర్‌ క్రైమ్‌ కాన్సెప్ట్‌తో ఉత్కంఠగా సాగింది. విభిన్నమైన కథాంశంతో సిద్ధమైన ఈచిత్రానికి జనార్దన్‌ కథ అందించి, దర్శకత్వం వహించారు. వివిద్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఈసినిమా రూపుదిద్దుకుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని