Samantha: సామ్‌ను మెచ్చుకున్న గుణశేఖర్.. నటి రిప్లయ్‌పై ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇదే
అగ్రకథానాయిక సమంతపై దర్శకుడు గుణశేఖర్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘యశోద’ వీక్షించిన ఆయన సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెడుతూ సామ్‌ని మెచ్చుకున్నారు.
హైదరాబాద్: అగ్రకథానాయిక సమంతపై (Samantha) ప్రశంసల వర్షం కురిపించారు దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar). ‘యశోద’లో సామ్ నటన చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. ‘‘సామ్ నటనలోని తీవ్రత, యాక్షన్ సీక్వెన్స్‌లతో ‘యశోద’ ఆసక్తికరంగా ఉంది. సినిమా ఆరంభంలో సామ్‌ను అమాయకపు అమ్మాయిగా చూపించి.. రానున్న మలుపులకు ఆవిధంగా దశను నిర్దేశించారు. సామ్.. ఈ సినిమాతో మరో విజయం నీ కిరీటంలో చేరింది’’ అని గుణ శేఖర్ పేర్కొన్నారు.
దీనిపై సామ్ స్పందిస్తూ.. ‘‘ధన్యవాదాలు సర్. ‘శాకుంతలం’ కోసం వేచి చూస్తున్నా. నేను ఏదైతే మ్యాజిక్‌ని చూశానో దాన్ని సినీ ప్రియులకు చూపించేందుకు ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొంది. ఆమె పెట్టిన రిప్లయ్‌పై ఆమె అభిమానులు స్పందిస్తూ.. తాము కూడా ఆ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. త్వరగా అప్‌డేట్‌లు ఇవ్వాలని కోరుతూ గుణశేఖర్, నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు సామ్‌ని మెచ్చుకుంటూ నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు. ఇక ‘శాకుంతలం’ విషయానికి వస్తే కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దీన్ని రూపొందించారు. శకుంతల, దుష్యంత మహారాజుల ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగుతుంది. దేవ్ మోహన్, అల్లు అర్హ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
WTC Final 2023: అజింక్య రహానే.. ఆ బాధ్యత నీదే: రాహుల్ ద్రవిడ్
-
General News
Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో ఎంఐపీ ఏర్పాటుపై ప్రజాగ్రహం
-
Movies News
Naga Chaitanya: నాగ చైతన్య రీమేక్ సినిమాపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన టీమ్
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. రంగంలోకి సీబీఐ
-
India News
Manipur: మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్పై బ్యాన్ కొనసాగింపు