Gunasekhar: గుణ శేఖర్‌ ఇంట శుభకార్యం.. వేడుకగా నీలిమ నిశ్చితార్థం

గుణశేఖర్‌ (GunaShekar) ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమార్తె, నిర్మాత నీలిమ (Neelima) నిశ్చితార్థం వేడుకగా జరిగింది. 

Published : 08 Oct 2022 13:21 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ (Guna Sekhar) ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమార్తె నీలిమ (Neelima) ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో రవి ప్రక్యాతో నీలిమ నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

కాబోయే భర్తను పరిచయం చేస్తూ నీలిమ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘నా జీవితకాల ప్రయాణం మొదలైంది’’ అని పేర్కొన్నారు. దీంతో ఆమెకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో తండ్రిబాటలోనే అడుగులు వేసిన నీలిమ నిర్మాతగా మారారు. గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘రుద్రమ దేవి’కి సహ నిర్మాతగా వ్యవహరించిన నీలిమ.. ఇప్పుడు ‘శాకుంతలం’ చిత్రానికి నిర్మాతగా చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని