Guntur Kaaram: మహేశ్ చిత్రం... ‘గుంటూరు కారం’
కొన్ని రోజులుగా చిత్రసీమలో వినిపిస్తున్నట్టుగానే మహేశ్ - త్రివిక్రమ్ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే పేరు ఖరారయ్యింది.
కొన్ని రోజులుగా చిత్రసీమలో వినిపిస్తున్నట్టుగానే మహేశ్ - త్రివిక్రమ్ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే పేరు ఖరారయ్యింది. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ‘మాస్ స్ట్రైక్’ పేరుతో విడుదల చేసిన ప్రచార చిత్రంతోపాటు, పేరుని ప్రకటించింది ఆ చిత్రబృందం. ‘ఏంది అట్టా చూస్తున్నావు... బీడీ త్రీడీలో కనపడుతుందా?’ అంటూ ఓ సంభాషణ కూడా ప్రచార చిత్రంలో వినిపించింది. అందులో మహేశ్ చేసిన యాక్షన్ హంగామా అభిమానుల్ని అలరిస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా ఇది. పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: మరో రెండు కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన.. 12వేల మందికి ఉపాధి
-
ChatGPT: చాట్‌జీపీటీ నుంచి బిగ్ అప్డేట్.. ఇక రియల్‌టైమ్ సమాచారం
-
Cricket: చైనాకు బయల్దేరిన టీమ్ఇండియా.. ఆ రెండు మ్యాచ్‌లకు బావుమా దూరం
-
MS Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Viral video: సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు.. వీడియో వైరల్