Gurthunda Seethakalam: జూన్‌లో శీతాకాలం

సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగ శేఖర్‌ దర్శకుడు. భావన రవి, రామారావు చింతపల్లి, నాగశేఖర్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. జూన్‌లో విడుదలకు

Updated : 13 May 2022 13:52 IST

త్యదేవ్‌, తమన్నా జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగ శేఖర్‌ దర్శకుడు. భావన రవి, రామారావు చింతపల్లి, నాగశేఖర్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. జూన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో సత్యదేవ్‌, తమన్నా రొమాంటిక్‌ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. కన్నడలో విజయవంతమైన ‘లవ్‌ మాక్‌టైల్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. ఆహ్లాదకరమైన ప్రేమకథతో సాగుతుంది. ఇందులో మేఘా ఆకాష్‌, కావ్య శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:కాల భైరవ, ఛాయాగ్రహణం: సత్య హెగ్డే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని