Gurthundha Seethakalam: ఈ సినిమా అందరి హృదయాలు గెలుచుకుంటుంది..: సత్యదేవ్‌

సత్యదేవ్‌, తమన్నా నటిస్తోన్న ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రం  ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమా టీమ్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు.

Published : 28 Nov 2022 17:20 IST

హైదరాబాద్‌: సత్యదేవ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమా డిసెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సత్యదేవ్‌ మాట్లాడుతూ.. ‘తమన్నా సినిమాను అంగీకరించడం చాలా సంతోషంగా అనిపించింది. మూడు లవ్‌స్టోరీలు కలిసిన మంచి ప్రేమకథా చిత్రమే ఈ ‘గుర్తుందా శీతాకాలం’ అని అన్నారు. ‘‘నేను కామెడీ, ప్రేమ కథా చిత్రాలు చేస్తున్నా.. పెద్ద క్యారెక్టర్‌లు వస్తున్నాయేంటి అనుకునేవాడిని. అప్పుడు నాకు నాగ్‌శేఖర్‌ ఈ కథ చెప్పారు. 10 నిమిషాలకే ఓకే చేశాను. హీరోయిన్‌ గురించి ఆలోచిస్తుంటే తమన్నా అంగీకరించినట్లు చెప్పారు. ఈ సినిమాలో తమన్నా చేసిన  పాత్ర ఎప్పుడూ చేయలేదు. ‘సుహాసిని’ పాట యూత్‌ను ఆకట్టుకుంది. నాగ్‌శేఖర్‌ ఈ సినిమా తర్వాత టాప్‌ దర్శకుల్లో ఒకరుగా ఉంటారు. ఈ చిత్రం కచ్చితంగా అందరి హృదయాలను గెలుచుకుంటుంది. కమర్షియల్‌గా పెద్ద విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నా’’ అన్నారు.

ఇక దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్‌ అందరూ కలిసి ఒకేసారి సెలెక్ట్‌ చేశారన్నారు. ఈ ప్రేమకథ అందరి హృదయాలకు హత్తుకుంటుందని తెలిపారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు కాలభైరవ ట్యూన్స్‌ అందించారు. ఇందులో మేఘా ఆకాష్‌, కావ్య శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. భావన రవి, రామారావు చింతపల్లి, నాగ్‌శేఖర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని