Satyadev-Tamannaah,: ‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సత్యదేవ్, తమన్నా నటిస్తోన్న ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
హైదరాబాద్: టాలీవుడ్లో రానున్న ఫీల్ గుడ్ మూవీల్లో ‘గుర్తుందా శీతాకాలం’ ఒకటి. కాలేజీ రోజుల్లో యువత జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కన్నడలో విడుదలై విజయాన్ని అందుకున్న ‘లవ్ మాక్‌టైల్’ చిత్రాన్ని తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ పేరుతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి వాళ్ల జీవితంలోని కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయని తెలిపింది. నాగ్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. ఆయన సరసన మిల్కి బ్యూటీ తమన్నా అలరించనుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు కాలభైరవ ట్యూన్స్ అందించారు. ఇందులో మేఘా ఆకాష్, కావ్య శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. భావన రవి, రామారావు చింతపల్లి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్
-
Ts-top-news News
Samathamurthy: నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!