Gurtunda Seetakalam: ‘గుర్తుందా శీతాకాలం’.. ఈతరం ‘గీతాంజలి’

‘‘శీతాకాలంలో జరిగే నాలుగు ప్రేమకథల సమాహారమే ‘గుర్తుందా శీతాకాలం’. దేవ్‌ అనే వ్యక్తి జీవితంలోని నాలుగు దశల్ని ఆవిష్కరిస్తుంది. ఈ కథ అందరినీ నవ్విస్తుంది. కంటతడి పెట్టిస్తుంది.

Updated : 04 Dec 2022 07:14 IST

‘‘శీతాకాలంలో జరిగే నాలుగు ప్రేమకథల సమాహారమే ‘గుర్తుందా శీతాకాలం’ (Gurtunda Seetakalam). దేవ్‌ అనే వ్యక్తి జీవితంలోని నాలుగు దశల్ని ఆవిష్కరిస్తుంది. ఈ కథ అందరినీ నవ్విస్తుంది. కంటతడి పెట్టిస్తుంది. భావోద్వేగాలతో బరువెక్కిస్తుంది’’ అన్నారు సత్యదేవ్‌ (Satyadev). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని నాగశేఖర్‌ తెరకెక్కించారు. రామారావు చింతపల్లి, భావనా రవి, నాగశేఖర్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, మేఘ ఆకాష్‌, కావ్య శెట్టి కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇన్నాళ్లు ఎక్కువగా సీరియస్‌గా సాగే కథలే చేశాను. అందుకే అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా చెయ్యాలన్న ఆలోచనతో ఈ ప్రేమకథ ఎంచుకున్నా. ఈ చిత్రంలో ఒకటి కాదు.. ఏకంగా నాలుగు భిన్నమైన ప్రేమకథలున్నాయి. ఇందులో నా పాత్ర మూడు కోణాల్లో కనిపిస్తుంది. ఈ సినిమాలోని కాలేజ్‌ ఎపిసోడ్‌ అందరికీ బాగా నచ్చుతుంది. ఈతరం ప్రేక్షకులు గుర్తుంచుకునే ‘గీతాంజలి’నే మా ‘గుర్తుందా శీతాకాలం’’ అన్నారు. ‘‘తెలుగులో నాకిది తొలి సినిమా. అందరికీ కనెక్ట్‌ అయ్యే ప్రేమకథగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు నాగశేఖర్‌. నిర్మాత రామారావు మాట్లాడుతూ.. ‘‘నాగశేఖర్‌ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. ఈ శీతాకాలంలో ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది ఈ సినిమా’’ అన్నారు. మేఘ ఆకాష్‌ మాట్లాడుతూ.. ‘‘నా నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే అది నాకు చాలా నచ్చింది’’ అంది.కార్యక్రమంలో రచయత లక్ష్మీ భూపాల్‌తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని