క్యాన్సర్‌ను జయించిన ప్రముఖ నటి.. ఇది పునర్జన్మ అంటూ పోస్ట్‌...

క్యాన్సర్‌ను జయించి తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు హంసా నందిని(Hamsa Nandini) పోస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు.   

Updated : 09 Dec 2022 12:38 IST

హైదరాబాద్‌: అనుమానాస్పదం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హంసా నందిని(Hamsa Nandini). ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రలతో అలరించింది. స్పెషల్‌ సాంగ్స్‌తోనూ ఆకట్టుకుంది. అయితే.. గత డిసెంబర్‌లో తాను క్యాన్సర్‌(cancer) బారిన పడినట్లు చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా మహమ్మారిని జయించానని చెప్పిన ఈ ముద్దుగుమ్మ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. 16 సార్లు కీమోథెరఫి(chemotherapy) తీసుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నానని సోషల్‌మీడియాలో ఫొటోలను షేర్‌ చేసింది.  ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన అందరూ హంసా నందినిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘సినిమా సెట్‌లోకి అడుగుపెట్టిన క్షణం నేను పొందిన అనుభూతే వేరు. ఇది నాకు పునర్జన్మ లాంటిది. ఇప్పటి వరకు నేను చేసుకున్న పుట్టినరోజుల్లో ఇది చాలా ప్రత్యేకమైనది. క్యాన్సర్‌ను జయించి తిరిగి కెమెరా ముందుకు వచ్చిన నేను నా కోస్టార్స్‌, మూవీ యూనిట్‌తో కలిసి పుట్టినరోజు చేసుకున్నా. ఇన్ని రోజులు ఈ ఆనందాన్ని మిస్‌ అయ్యాను. మీ అందరి ప్రేమ, అభిమానం వల్లనే నేను కోలుకోగలిగాను.  ఐ యామ్‌ బ్యాక్‌..’ అంటూ తను షూటింగ్‌లో పొల్గొన్న ఫొటోలను షేర్‌ చేసింది హంసానందిని. ఇక ఈ పోస్ట్‌ చూసిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు ‘మీరు ఫైటర్‌’, ‘ఇన్ని రోజులు మిమ్మల్ని మిస్‌ అయ్యాం’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని