Hansika: కాబోయే భర్తతో హన్సిక పర్సనల్‌ ఫొటో లీక్‌.. స్పందించిన నటి

‘దేశముదురు’తో తెలుగు యువత హృదయాలను కొల్లగొట్టిన నటి హన్సిక. త్వరలో ఈ చిన్నది తన స్నేహితుడితో ఏడడుగులు వేయనున్నారు.

Updated : 21 Nov 2022 15:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి హన్సిక (Hansika) త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌తో వచ్చే నెలలో ఆమె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో వీరిద్దరూ బోట్‌లో సరదాగా షికారుకు వెళ్తూ కనిపించారు. hansika.officiaal అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి ఇది బయటకు వచ్చింది. దీనిపై హన్సిక స్పందిస్తూ ఇది తన ఖాతా కాదని.. ఫేక్‌ అకౌంట్‌ అని రిప్లై ఇచ్చారు. ఇది లీక్‌ చేసిన ఫొటో లేదా మార్ఫింగ్‌ ఫొటో  అయి ఉండొచ్చని పలువురు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక, రాజస్థాన్‌ జైపూర్‌లోని ఓ రాజకోటలో డిసెంబర్‌ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్‌ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు