Hansika: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్.. నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు: హన్సిక
ఎనిమిదేళ్ల వయసులోనే బాలనటిగా ఎంట్రీ ఇచ్చి.. ‘దేశముదురు’తో కథానాయికగా తెలుగువారిని అలరించారు నటి హన్సిక (Hansika). తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి తాను మాట్లాడినట్లు చక్కర్లు కొడుతోన్న వార్తలపై నటి హన్సిక (Hansika) క్లారిటీ ఇచ్చారు. ఆ కథనాల్లో ప్రచురించినట్లు తానస్సలు మాట్లాడలేదని చెప్పారు. అంతేకాకుండా, వార్తలు పబ్లిష్ చేసేముందు ఒక్కసారి సరిచూసుకోవాలని తెలిపారు. ‘‘నేను ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి చెత్తను పబ్లిష్ చేయడం మానండి. ఏదైనా వార్తలను గుడ్డిగా పబ్లిష్ చేయకుండా కాస్త నిజానిజాలను పరిశీలించాలని కోరుతున్నాను. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ వ్యాఖ్యలు నేను ఇప్పటివరకూ ఎక్కడా చెప్పలేదు’’ అని ఆమె రాసుకొచ్చారు.
వివాహం తర్వాత తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టారు నటి హన్సిక. తన తదుపరి సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సుమారు ఏడు సినిమాలు\ సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం నుంచి హన్సికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తాను నటిగా కెరీర్ మొదలుపెట్టిన సమయంలో టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో తనని ఇబ్బంది పెట్టాడని, డేట్‌కు రమ్మని తరచూ విసిగించేవాడని, అతడికి సరైన బుద్ధి చెప్పానని, ఆ తర్వాత అతడు తన జోలికి రాలేదని హన్సిక చెప్పినట్లు పలు వార్తలు దర్శనమిచ్చాయి. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా? అని అందరూ చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆమె స్పష్టత నిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం!’.. వినూత్న నిరసనకు తెదేపా పిలుపు
-
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 19,600 పైకి నిఫ్టీ
-
Ashwin: అదృష్టమంటే అశ్విన్‌దే.. అనుకోకుండా మళ్లీ ప్రపంచకప్ జట్టులో!
-
Abhishek Banerjee: నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు.. ఈడీ సమన్లపై అభిషేక్ బెనర్జీ
-
Rain: హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
-
The Sycamore Gap: ప్రఖ్యాత సైకమోర్ గ్యాప్ వృక్షం నరికివేత.. 16 ఏళ్ల బాలుడి దుశ్చర్య..!