Hansika: పెన్ను, పేపర్ తీసుకుని ఒకరి జీవితాన్ని రాసేద్దామనుకుంటారు: హన్సిక
Hansika: కథూరియాతో ప్రేమ, కుటుంబ సభ్యులను ఒప్పించడం.. ఆ తర్వాత జైపుర్‌లో పెళ్లి జరగడం.. ఇలా హన్సిక వివాహానికి సంబంధించిన విశేషాలను ‘హన్సిక లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఎవరు పెళ్లి చేసుకుంటున్నారో నీకు తెలుసా? ఇది నా పెళ్లి అని నీకు తెలుసా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించారు కథానాయిక హన్సిక (Hansika Motwani). తాను ప్రేమించిన సోహైల్ కథూరియా (Sohail Khaturiya)ని హన్సిక ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబరు 4న జైపుర్‌లో వీరి విహహం జరిగింది. ఆ వేడుక ప్రసార హక్కుల్ని ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar) సొంతం చేసుకుంది. తాజాగా వెడ్డింగ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో ‘‘కథూరియాతో పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు ‘ఇన్నాళ్లూ నా చుట్టూ తిరుగుతూ ఉన్న ఇతనా లైఫ్ పార్టనర్ అయ్యేది’ అని అనిపించిందని హన్సిక చెప్పారు. హన్సిక కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగాలనుకుంటే నూతన వధూవరులు మాత్రం మోడ్రన్ పద్ధతిలో జరగాలంటూ పట్టుబట్టారు. తాను ఎమోషనల్ పర్సన్ అంటూ హన్సిక చెప్పింది. అలాగే సోహెల్‌ను పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో హన్సిక పోరాటం చేసినట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఎమోషనల్ జర్నీ కాబట్టే ఈ వెడ్డింగ్ వీడియో ‘హన్సిక లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!