Hansika: ఓటీటీలో హన్సిక వివాహ వేడుక.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నటి హన్సిక త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా హన్సిక వివాహానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈ పెళ్లికి సంబంధించిన హక్కులను భారీ ధరకు కొన్నట్లు సమాచారం.

Published : 15 Nov 2022 01:40 IST

హైదరాబాద్‌: తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా అలరించారు హన్సిక(Hansika). ఇటీవల తన సింగిల్‌ స్టేటస్‌కు గుడ్‌బై చెప్పిన ఈ భామ పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సోహైల్‌(Sohael)తో ఈ అమ్మడు డిసెంబర్‌4న ఏడడుగులు వేయనుంది. జైపూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ‘ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌’లో జరగనున్న ఈ వివాహా కార్యక్రమానికి సంబంధించిన ప్రసార హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ భారీధరకు కొన్నట్లు సమాచారం.

అయితే ఈ విషయాన్ని అటు డిస్నీ కానీ ఇటు హన్సిక కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. పెళ్లి మొత్తాన్ని లైవ్‌ ఇస్తారా.. లేదంటే పెళ్లి జరిగాక కొన్నిరోజులకు డాక్యుమెంటరీ రూపంలో స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉంచుతారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. కాగా డిసెంబర్‌ 2 సూఫీ నైట్‌తో వివాహ వేడుక ప్రారంభం కానుంది. 3వ తేదీన మెహందీ, సంగీత్‌ నిర్వహించనున్నారు. 4వ తేదీన హల్దీ జరగనుండగా అదే రోజు సాయంత్రం కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటికానున్నారు. దీనికోసం ఈ హోటల్‌లోని అన్ని గదులు, సూట్లను బుక్‌ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ వార్త నిజమేనని.. తమ అభిమాన కథానాయిక పెళ్లిని వీక్షించే అవకాశం రానుండడంతో డిజిటల్‌ ప్రేక్షకులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

బాలనటిగా కెరీర్‌ ప్రారంభించి కొద్ది కాలంలోనే పాపులారిటీ సంపాదించిన హన్సిక మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘పార్ట్‌నర్‌’, ‘105 మినిట్స్‌’ చిత్రాల షూటింగ్‌ పూర్తవగా.. తెలుగులో ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’, తమిళంలో నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts