Hansika: అది ముగిసిన కథ.. దానికి నాకు 7 ఏళ్లు పట్టింది: హన్సిక

తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో అలరిస్తోంది హీరోయిన్‌ హన్సిక (Hansika). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రేకప్‌ తర్వాత తిరిగి ప్రేమను అంగీకరించడానికి 7 సంవత్సరాలు పట్టిందని తెలిపింది. 

Updated : 20 Feb 2023 11:48 IST

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్‌ హన్సిక (Hansika). తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ యాపిల్‌ బ్యూటీ ఇటీవల సోహైల్‌ కథూరియాను వివాహం చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోహైల్‌ ప్రేమను తాను అంగీకరించడానికి కొన్ని సంవత్సరాలు తీసుకున్నట్లు తెలిపింది.

‘‘నేను స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశాను. బ్రేకప్‌ తర్వాత మరొకరికి ఓకే చెప్పి వాళ్ల ప్రేమను అంగీకరించేందుకు 7 సంవత్సరాలు పట్టింది. నాకు ప్రేమపై పూర్తి నమ్మకం ఉంది. నేను రొమాంటిక్‌ పర్సన్‌ని. కానీ నాకు ప్రేమను వ్యక్తపరచడం తెలియదు. నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. నిజం చెప్పాలంటే నాతో జీవితం పంచుకునే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకోడానికి చాలా సమయం తీసుకున్నాను. సోహైల్‌ కథూరియా కూడా నా ప్రేమ కోసం ఎంతో ఎదరుచూశాడు. తను నన్ను ఎంతగా ప్రేమిస్తాడో మాటల్లో చెప్పలేను’’ అని చెప్పింది. తన ఓల్డ్‌  రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘అది ముగిసిన కథ. ప్రస్తుతం దేవుడు నాకు మంచి దారి చూపించాడు. ప్రతి ఒక్కరి జీవితానికి ఓ కొత్త ప్రారంభం ఉంటుందని నేను నమ్ముతాను’’ అని తెలిపింది హన్సిక.

ఇక హన్సిక వివాహ వేడుక ‘లవ్‌ షాదీ డ్రామా’ (love shaadi drama) పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో తన కెరీర్‌లో ఎదురైన అనేక అనుభవాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను హన్సిక పంచుకుంది. కథానాయికగా హన్సిక ఎంట్రీ ఇచ్చే క్రమంలో హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు అప్పట్లో వచ్చిన వార్తలపైనా కూడా ఆమె స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదని తెలిపింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలని చెప్పింది. ప్రస్తుతం హన్సిక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ‘పార్ట్‌నర్‌’, ‘105 మినట్స్‌’ చిత్రాల షూటింగ్‌ పూర్తి కాగా, ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ తదితర చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని