Hansika: వధువుగా ముస్తాబైన హన్సిక.. వీడియో వైరల్‌

హన్సిక పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికుమార్తెగా ముస్తాబైన ఆమె చిరు నవ్వులు చిందిస్తోన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 03 Dec 2022 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: నటి హన్సిక (Hansika) మరికొన్ని గంటల్లో సింగిల్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారు. తన ప్రియుడు సోహైల్‌తో (Sohael) ఆమె ఏడడుగులు వేయనున్నారు. డిసెంబర్‌ 4న వీరి వివాహం జరగనుంది. దీంతో ఇప్పటికే కల్యాణ వేదిక వద్దకు చేరుకున్న వధూవరుల కుటుంబాలు మెహందీ, సంగీత్‌, సుఫీ నైట్‌ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించాయి. ఈ వేడుకల్లో నూతన వధూవరులు హన్సిక - సోహైల్‌ పాల్గొని నవ్వులు పూయించారు. శుక్రవారం రాత్రి జరిగిన సూఫీ నైట్‌ వేడుకల్లో ఈ జంట వధూవరులుగా ముస్తాబై.. అందర్నీ అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను సోహైల్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘నీతో ఇలా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పటికీ ఎప్పటికీ నీతోనే’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాజస్థాన్‌ జైపుర్‌లోని ఓ రాజకోటలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని