Hanuman: క్షమాపణలు చెప్పిన ‘హను-మాన్‌’ దర్శకుడు.. ఎందుకంటే..

కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తూ అందరినీ ఆకర్షిస్తుంటాడు ప్రశాంత్ వర్మ. తాజాగా ట్విటర్‌ వేదికగా అందరికీ క్షమాపణలు చెప్పాడు.  

Published : 27 Nov 2022 14:21 IST

హైదరాబాద్‌: ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ప్రశాంత్‌ వర్మ. తొలి అడుగులోనే ‘అ!’ లాంటి వైవిధ్యభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు రుచి చూపించి..తాజాగా ‘హను-మాన్‌’ టీజర్‌తో అద్భుతం సృష్టించాడు. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సాధారణ ప్రేక్షకుల నుంచి అగ్ర దర్శకుల వరకూ అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రశాంత్‌ వర్మ ఓ విషయంలో ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రామాయణాన్ని పురాణం అన్నందుకు క్షమించండి అని సోషల్‌మీడియా వేదికగా కోరారు.

‘‘నా ప్రసంగంలో ‘పురాణం’ అనే పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. రామాయణం మన ‘చరిత్ర’..!’’ అని ట్వీట్‌ చేశారు. ఇక ‘జాంబి రెడ్డి’ తర్వాత యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘హను-మాన్‌’. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సూపర్‌హీరో చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, వీడియోలు చూసి అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని