Hanuman: భారీ ధరకు ‘హనుమాన్‌’ సినిమా హక్కులు!

తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్‌’ సినిమాకి మంచి క్రేజ్‌ ఏర్పడింది.

Published : 17 Feb 2022 02:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్‌’ సినిమాకి మంచి క్రేజ్‌ ఏర్పడింది. విడుదలకు ముందే ఇప్పటి వరకు రూ. 16 కోట్ల బిజినెస్‌ చేసింది. ఇప్పటికే హిందీ వెర్షన్‌ (నాన్‌- థియేట్రికల్‌)కు సంబంధించిన హక్కులు రూ.5 కోట్లకు అమ్ముడుపోగా తెలుగు వెర్షన్‌ (శాటిలైట్‌, డిజిటల్‌) రైట్స్‌ రూ. 11 కోట్ల ధర పలికాయి. ప్రముఖ ఎంటర్‌టైనింగ్‌ సంస్థ ‘జీ’ ఈ హక్కుల్ని దక్కించుకుంది. ఓ యువ హీరో నాలుగో సినిమానే ఇంత ధర పలకటం విశేషమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ‘జాంబిరెడ్డి’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత తేజ- ప్రశాంత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కావటంతో ‘హనుమాన్‌’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. తెలుగులో తెరకెక్కుతున్న తొలి ఒరిజినల్‌ సూపర్‌హీరో చిత్రమిది. అమృత అయ్యర్‌ కథానాయిక. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాకి అనుదీప్‌ దేవ్‌, హరిగౌర, జయకృష్ణ, కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని