Happy Birthday: ‘అందుబాటు ధరలో పార్టీ’.. ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా టికెట్‌ ధరెంతంటే?

‘అందుబాటులో ధరల్లో పార్టీలో అందరికీ ప్రవేశం’ అంటూ ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్ర బృందం తమ సినిమా టికెట్‌ ధరల వివరాలు తెలిపింది. ఈ చిత్రాన్ని జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సందర్బంగా వాటిని ప్రకటించింది.

Published : 05 Jul 2022 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అందుబాటులో ధరల్లో.. పార్టీలో అందరికీ ప్రవేశం’ అంటూ ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birthday) చిత్ర బృందం తమ సినిమా టికెట్‌ ధరల వివరాలు తెలిపింది. ఈ చిత్రాన్ని జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా వాటిని ప్రకటించింది. సింగిల్‌ స్క్రీన్లలో రూ. 110, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 117గా టికెట్‌ ధరలు ఉంటాయని వెల్లడించింది. ఏయే రాష్ట్రాల్లో ఈ ధరలు అందుబాటులో ఉంటాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. ‘మత్తువదలరా’ ఫేం రితేశ్‌ రాణ దర్శకత్వం వహించారు. ఇంటింటికీ గన్‌.. ఎదురులేని ఫన్‌ అనే విభిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందినట్టు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. మరి ఆ గన్‌లకు, బర్త్‌డే పార్టీకి సంబంధమేంటి? అసలు పుట్టినరోజు ఎవరిది? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇందులో లావణ్యతోపాటు నరేశ్‌ అగస్త్య, వెన్నెల కిశోర్‌, సత్య, గెటప్‌ శ్రీను తదితరులు నవ్వులు పంచనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని