Happy Birthday: అతిథిగా టామ్‌ క్రూజ్‌.. సరదాగా ‘హ్యాపీ బర్త్‌డే’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

లావణ్య త్రిపాఠి  ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. రితేశ్‌ రాణా దర్శకత్వం వహించారు. నరేశ్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానంది.

Updated : 07 Jul 2022 13:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్‌ కామెడీ చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birhday). ఈ సినిమాకి రితేశ్‌ రాణా దర్శకత్వం వహించారు. నరేశ్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ అతిథిగా వస్తున్నారంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేసి, చిత్ర బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాలో ఎంత ఫన్‌ ఉందో వేదికపైనా అంతే కామెడీ సృష్టించే ప్రయత్నం చేశారు. టామ్‌ క్రూజ్‌ వేడుకకు తీసుకురావడం కాదు ఆయన వీడియోలకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పించి, ‘హ్యాపీ బర్త్‌డే’ బృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. లావణ్య, నరేశ్‌, రితేశ్‌.. ఇలా అందరి స్పీచ్‌లు గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. ఆ విశేషాల గురించి చెప్పడంకంటే చూస్తేనే బావుంటుంది. ఆలస్యమెందుకు చూసేయండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని