Lavanya Tripati: ‘హ్యాపీ బర్త్‌ డే’ ఆరోజే

అందం.. అభినయంతో ఆకట్టుకున్న ఉత్తరాది సోయగం లావణ్య త్రిపాఠి. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్‌ కామెడీ సినిమా ‘హ్యాపీ బర్త్‌ డే’. ‘మత్తు వదలరా’ ఫేమ్‌ రితేష్‌ రానా తెరకెక్కిస్తున్నారు.

Updated : 06 May 2022 13:52 IST

అందం.. అభినయంతో ఆకట్టుకున్న ఉత్తరాది సోయగం లావణ్య త్రిపాఠి. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్‌ కామెడీ సినిమా ‘హ్యాపీ బర్త్‌ డే’. ‘మత్తు వదలరా’ ఫేమ్‌ రితేష్‌ రానా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 15న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. యాక్షన్‌కు ప్రాధాన్యమున్న క్రైమ్‌ కామెడీ చిత్రమిది. దీన్ని పాన్‌ ఇండియా సినిమాగా ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో సత్య, వెన్నెల కిషోర్‌, అగస్త్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని