Updated : 26 Jun 2022 06:43 IST

Happy Birthday: వారం ముందుగానే ‘హ్యాపీ బర్త్‌డే’

‘మత్తువదలరా’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించారు దర్శకుడు రితేష్‌ రానా(Ritesh Rana). ఇప్పుడాయన ‘హ్యాపీ బర్త్‌డే’(Happy Birthday)తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని జులై 15న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పుడీ చిత్రాన్ని జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ‘‘వినోదంతో నిండిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. లావణ్య సరికొత్తగా కనిపించనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: సురేష్‌ సారంగం.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts