Happy Birthday: మనసు పెట్టి చేస్తే.. ప్రేక్షకులు వదులుకోరు
‘‘ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం మనసు పెట్టి.. కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు. అందుకే అలా కష్టపడాలని సూచిస్తున్నా. ఈ ‘హ్యాపీ బర్త్‌డే’ విషయంలో ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు రాజమౌళి
‘‘ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం మనసు పెట్టి.. కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు. అందుకే అలా కష్టపడాలని సూచిస్తున్నా. ఈ ‘హ్యాపీ బర్త్‌డే’(Happy Birthday) విషయంలో ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు రాజమౌళి (Rajamouli). లావణ్య త్రిపాఠి(Lavanya Triparti) ప్రధాన పాత్రలో రితేష్ రానా(Ritesh rana) తెరకెక్కించిన చిత్రమిది. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి బుధవారం హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మంచి ప్రాజెక్ట్స్ వెతికి పట్టుకుంటూ బంగారం తవ్వుకునే సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. రితేష్‌కు తన సినిమాలపై నమ్మకం ఎక్కువ. ట్రైలర్లో పాన్ తెలుగు సినిమా అని చూడగానే నవ్వొచ్చింది. లావణ్య పాత్ర బాగుంది. చాలా బాగా నటించింది. కథను ముందుండి నడిపే ఇలాంటి పాత్రలు నాయికలకు దొరకడం అరుదు. కామెడీ, థ్రిల్లర్ కలిపి చేయడం చాలా కష్టం. ఒకటి ఎక్కువైతే ఇంకొకటి తగ్గిపోతుంది. రితేష్ వాటిని బాగా బ్యాలెన్స్ చేసుంటాడని తెలుస్తోంది’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా కంటే డబుల్ ఫన్, యాక్షన్, థ్రిల్ ఇందులో ఉన్నాయి’’ అన్నారు చిత్ర దర్శకుడు రితేష్. నటి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన చిత్రం. దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి సినిమా తెరపైకి వస్తుంది. నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది’’ అంది. ‘‘ఇదొక సర్రియల్ యాక్షన్ కామెడీ చిత్రం. ‘జాతిరత్నాలు’ సినిమాని ఫ్యామిలీతో కలిసి ఎలా ఎంజాయ్ చేశారో.. మా చిత్రాన్నీ అలాగే ఆస్వాదిస్తారు’’ అన్నారు నిర్మాతలు వై.రవిశంకర్, చెర్రి. ఈ కార్యక్రమంలో సురేష్ సారంగం, రవితేజ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్‌తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్‌తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్‌లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్‌గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా