Prithviraj: ‘పృథ్వీరాజ్‌’గా అక్షయ్‌ కుమార్‌.. స్ఫూర్తినింపేలా ‘హరి హర’ గీతం

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడికల్‌ చిత్రం ‘పృథ్వీరాజ్‌’. మిస్‌ యూనివర్స్‌-2017 విజేత మానుషి చిల్లర్‌ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమవుతోంది.

Published : 12 May 2022 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడికల్‌ చిత్రం ‘పృథ్వీరాజ్‌’. మిస్‌ యూనివర్స్‌- 2017 విజేత మానుషి చిల్లర్‌ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమవుతోంది. సంజయ్‌దత్‌, సోనూసూద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జూన్‌ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాలోని తొలి పాటను రిలీజ్‌ చేసింది. ‘హరి హర’ అంటూ సాగే ఈ స్ఫూర్తివంతమైన పాటను చైతన్య ప్రసాద్‌ రచించగా దివాకర్‌ ఆలపించారు. శంకర్‌-ఇషాన్‌-లాయ్‌ త్రయం సంగీతం అందించారు. దిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితాధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ‘‘హరి హర’ పాట ఈ సినిమాకి ఆత్మలాంటిది. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ సాహసాలకు ఈ పాట ప్రతిబింబంలాంటిది’’ అని అక్షయ్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు