hari hara veera mallu: బల్లెంతో బరిలో దిగిన పవన్‌కల్యాణ్‌

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. చారిత్రక కథాంశంతో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై

Published : 07 Apr 2022 18:22 IST

హైదరాబాద్‌: క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. చారిత్రక కథాంశంతో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శుక్రవారం నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మరో షెడ్యూల్ మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో పోరాట సన్నివేశాలకు సంబంధించి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్‌తో కలిసి పవన్‌ బల్లెం పట్టుకొని ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. పవన్ మళ్లీ ‘హరిహర వీరమల్లు’పై దృష్టి సారించడంతో సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను టోడర్‌ లాజరోవే తీర్చిదిద్దారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని